వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిగడప రామాలయం వద్ద క్రీ.శ. 1518 నాటి శిలాశాసనం చెక్కుచెదరకుండా ఉంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాయసం కొండమరుసయ్య తన తల్లి సంగోయమ్మ పేరిట తాగునీటి బావి తవ్వించిన వివరాలు ఇందులో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
విజయనగర సామ్రాజ్య చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ఈ శిల ప్రాధాన్యం తెలియక కొందరు దానిపై కూర్చోవడం, చిన్నారులు ఆడుకోవడం చేస్తున్నారు. దీనిని సంరక్షించాల్సిన అవసరం ఉంది.
Comments
Loading comments...

