వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండలో శుక్రవారం ఎయిడ్స్ నివారణ, అవగాహనపై నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ప్రారంభించారు. హెచ్‌ఐవీపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, వ్యాధి నివారణ చర్యలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
యువత, విద్యార్థులు ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ర్యాలీలో అధికారులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

