Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సలామాబాద్‌ ట్రేడ్‌ సెంటర్‌ ఇక టూరిజం స్పాట్

Follow Udayam on Google
SAI NATH Sep 18, 2026 1:21 PM జాతీయంGeneral
సలామాబాద్‌ ట్రేడ్‌ సెంటర్‌ ఇక టూరిజం స్పాట్ - Udayam
జమ్మూకశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌ సలామాబాద్‌ ట్రేడ్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ఇకపై సరిహద్దు పర్యాటకానికి ఉపయోగపడనుంది. 2019లో నిలిచిపోయిన క్రాస్‌-ఎల్‌ఓసీ వాణిజ్యం పునరుద్ధరణకు అవకాశం లేకుండా.. కేంద్రాన్ని పరిశ్రమలు, వాణిజ్య శాఖ నుంచి పర్యాటక శాఖకు అప్పగించారు. 2008లో ప్రారంభమైన ఈ వాణిజ్యం రెండు వైపులా వస్తువుల మార్పిడి విధానంలో సాగింది. భద్రతా కారణాలతో 2019లో నిలిపివేశారు.

Comments

G
Loading comments...