వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్‌లో తృశ్వంత్ యువసేన ఆధ్వర్యంలో భారీ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా జిల్లాలో తొలిసారిగా 111 కిలోల భారీ లడ్డూను ఏర్పాటు చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన లడ్డూను భక్తులు, స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. గణనాథుడికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

