Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛ సాగర్ తో సముద్ర తీరాల శుభ్రత

Follow Udayam on Google
K Anuradha Sep 19, 2026 4:51 PM శ్రీకాకుళంGeneral
స్వచ్ఛ సాగర్ తో సముద్ర తీరాల శుభ్రత - Udayam
పెద్దకొవ్వాడ, చిన్నకొవ్వాడ బీచ్‌లలో శనివారం ‘స్వచ్ఛ సాగర్–సురక్ష సాగర్’ కార్యక్రమం నిర్వహించారు. మత్స్యశాఖ, మెరైన్‌ పోలీసులు, సచివాలయ సిబ్బంది, సాగరమిత్ర సభ్యులు, మత్స్యకారులు కలిసి ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించారు. సముద్రంలోకి ప్లాస్టిక్‌ చేరకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. రణస్థలం ఎఫ్‌డీఓ కె.గంగాధరరావు, కళింగపట్నం మెరైన్‌ ఎస్‌ఐ జి.హరికృష్ణరావు ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు.

Comments

G
Loading comments...