Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సు సౌకర్యం లేక విద్యార్థుల ఇక్కట్లు

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 9:55 AM కామరెడ్డిGeneral
బస్సు సౌకర్యం లేక విద్యార్థుల ఇక్కట్లు - Udayam
నిజాంసాగర్ మండలం నర్సింగ్రావుపల్లి, మంగ్లూర్ గ్రామాల విద్యార్థులకు పాఠశాల, కళాశాలలకు వెళ్లడం సవాలుగా మారింది. బస్సు సౌకర్యం లేక చౌరస్తా వరకు నడుచుకుంటూ లేదా సైకిళ్లపై వెళ్లాల్సి వస్తోందని గ్రామస్థులు తెలిపారు. చౌరస్తాకు చేరుకున్నా బస్సులు ఆపకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని, వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...