Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కమిషనర్

Follow Udayam on Google
అనురూప్ Aug 19, 2026 3:07 PM కర్నూలుఆంధ్రప్రదేశ్
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కమిషనర్ - Udayam
విధుల పట్ల అలసత్వం, క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరించారు. బుధవారం పాతబస్తీ, జొహరాపురం, ఏ.క్యాంపు తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. విధులకు సక్రమంగా హాజరుకాని 2వ శానిటేషన్ డివిజన్ డ్రైవర్ రాముపై రాతపూర్వక నివేదిక తీసుకుని చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. పారిశుద్ధ్య సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...