Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్వీసింగ్‌కు ఇస్తే కారు అమ్మేశాడు

Follow Udayam on Google
Shruthi Oct 13, 2026 9:30 AM విశాఖపట్నంGeneral
సర్వీసింగ్‌కు ఇస్తే కారు అమ్మేశాడు - Udayam
విశాఖ ఎండాడలో కారు సర్వీసింగ్‌కు ఇచ్చిన వ్యక్తిని మెకానిక్ మోసగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మరమ్మతుల పేరుతో రూ.5.70 లక్షలు తీసుకుని, కారును గుంటూరుకు చెందిన వారికి విక్రయించిన మెకానిక్ సందీప్ రెడ్డిని ఆరిలోవ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...