వార్తలకు తిరిగి వెళ్లండి

మరిపెడ మండలం చిల్లంచర్ల జడ్పీ పాఠశాలలో బుధవారం విషసర్పం తరగతి గదిలోకి ప్రవేశించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. ఉపాధ్యాయుడు శ్రీకాంత్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.
పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతోనే పాములు సంచరిస్తున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రహరీ నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

