Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమాచారం ఇవ్వలేదని ఎంపీడీవోకు జరిమానా

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 10:09 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
సమాచారం ఇవ్వలేదని ఎంపీడీవోకు జరిమానా - Udayam
గడువులోగా సమాచారాన్ని అందించకపోవడంతో ఇల్లందు ఎంపీడీవో ధన్‌సింగ్‌కు రూ.3 వేల జరిమానా విధించారు. తిలక్‌నగర్‌కు చెందిన మాచర్ల విజయ్‌కుమార్ ఆర్టీఐ ద్వారా వివరాలు కోరగా, సమాచారం అందకపోవడంతో కమిషనర్‌ను ఆశ్రయించారు. కమిషనర్ ఇచ్చిన గడువులోనూ వివరాలు ఇవ్వకపోవడంతో కమిషనర్ పి.వి.శ్రీనివాస్ సోమవారం జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Comments

G
Loading comments...