Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగూర్‌లో 4.14 టీఎంసీల నీటి నిల్వ

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 08, 2026 12:00 PM మెదక్General
సింగూర్‌లో 4.14 టీఎంసీల నీటి నిల్వ - Udayam
ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని సింగూర్‌ ప్రాజెక్టు నీటిమట్టం శనివారం ఉదయం 6 గంటలకు 515.145 మీటర్లకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 523.600 మీటర్లు కాగా, 29.917 టీఎంసీల సామర్థ్యానికి 4.140 టీఎంసీల నిల్వ ఉంది. గత 24 గంటల్లో సగటున 276 క్యూసెక్కుల నీరు వచ్చిందని అధికారులు తెలిపారు. దిగువకు 380 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...