Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీతారామ ప్రాజెక్టు వద్ద అద్భుత హరివిల్లు

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 7:16 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
సీతారామ ప్రాజెక్టు వద్ద అద్భుత హరివిల్లు - Udayam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలోని సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్ వద్ద ఆదివారం ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పంప్‌హౌస్ నుంచి ఎగసిపడే గోదావరి జలాల నీటితుంపరలపై సూర్యకాంతి పడటంతో రంగుల హరివిల్లు ఏర్పడి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆకాశం నుంచి నేలకు నిచ్చెన వేసినట్లుగా కనిపించిన ఈ ఇంద్రధనుస్సును చూసేందుకు పర్యాటకులు, స్థానికులు ఆసక్తి చూపారు.

Comments

G
Loading comments...