Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరెంటు కోతలపై గంగుల ఆధ్వర్యంలో ధర్నా

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 7:20 AM కరీంనగర్General
కరెంటు కోతలపై గంగుల ఆధ్వర్యంలో ధర్నా - Udayam
కరీంనగర్ గ్రామీణ మండలం గోపాల్‌పూర్ వద్ద రాజీవ్ రహదారిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో రైతులు భారీ ధర్నా నిర్వహించారు. నిరంతర విద్యుత్ సరఫరా పునరుద్ధరించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు, పంపుసెట్లను రహదారిపై ఉంచి మహిళా రైతులు బతుకమ్మ ఆడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. కరెంటు కోతలతో వ్యవసాయం సంక్షోభంలో పడిందని నేతలు విమర్శించారు.

Comments

G
Loading comments...