Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఐ జయన్నను సస్పెండ్ చేయాల్సిందే.. రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్

Follow Udayam on Google
H M G H Q Sep 13, 2026 7:04 PM కర్నూలుGeneral
సీఐ జయన్నను సస్పెండ్ చేయాల్సిందే.. రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ - Udayam
పత్తికొండ అర్బన్ సీఐ జయన్నను సస్పెండ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, వైసీపీ మండల కన్వీనర్ కారం నాగరాజు, సీపీఎం సీనియర్ నాయకులు రంగారెడ్డి డిమాండ్ చేశారు. జర్నలిస్టు జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వార్తా సేకరణకు వెళ్లిన విశాలాంధ్ర విలేఖరి ఎం.నాగరాజును సీఐ మెడ పట్టి గెంటి, దూషించడాన్ని ఖండించారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...