వార్తలకు తిరిగి వెళ్లండి

శాతవాహన యూనివర్సిటీ ప్రాంతంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. రోడ్డుపైకి ఎలుగుబంటి రావడంతో విద్యార్థులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తమయ్యారు.
ఇటీవల యూనివర్సిటీ పరిధిలో అడవిని ధ్వంసం చేయడమే ఇందుకు కారణమని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు. అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

