వార్తలకు తిరిగి వెళ్లండి

లోతుకుంట నలభై ఎకరాల భూ వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు తీర్పును సవాలు చేయడంలో తీవ్ర జాప్యం జరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. అధికారుల నిర్లక్ష్యం వల్లనే అప్పీల్ ఆలస్యమైందని, న్యాయస్థానంలో నిర్లక్ష్యం తగదని స్పష్టం చేస్తూ సర్కార్ ఎస్ఎల్‌పీని తిరస్కరించింది.
Comments
Loading comments...

