వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువ ప్రాంతాల భారీ వర్షాలతో గోదావరిలో నీటిమట్టం పెరగడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు ములుగు కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు తెలిపారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
చేపల వేటకు వెళ్లొద్దని, అత్యవసర పరిస్థితుల్లో టోల్‌ఫ్రీ 1800-425-7109కు సమాచారం ఇవ్వాలని కోరారు. కన్నాయిగూడెం, ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Comments
Loading comments...

