Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయి నామస్మరణతో మారుమోగిన అమరచింత

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Jul 29, 2026 8:15 PM వనపర్తిGeneral
సాయి నామస్మరణతో మారుమోగిన అమరచింత - Udayam
గురు పౌర్ణమిని పురస్కరించుకొని వనపర్తి జిల్లా అమరచింతలోని షిరిడి సాయి ఆలయంలో భక్తిశ్రద్ధలతో సామూహిక సాయి సత్యవ్రతం నిర్వహించారు. బాబాకు ప్రత్యేక అభిషేకాలు, కాగడా హారతి ఇచ్చి పూజలు చేశారు. మానవాళికి జ్ఞానాన్ని అందించిన వేదవ్యాసుని స్మరిస్తూ గురు పూర్ణిమ జరుపుకోవడం సనాతన ధర్మ సంప్రదాయమని పూజారులు పేర్కొన్నారు. సాయి సేవా సమితి ప్రతినిధులు, భక్తులు ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...