Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా సైన్యంలో చేరేవారికి బంపర్ ఆఫర్: 10 మిలియన్ రూబుల్స్ రుణ రాయితీ

Follow Udayam on Google
Ajay Desai May 27, 2026 11:54 AM జాతీయంGeneral
రష్యా సైన్యంలో చేరేవారికి బంపర్ ఆఫర్: 10 మిలియన్ రూబుల్స్ రుణ రాయితీ - Udayam
ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో సైనిక బలాన్ని పెంచుకునేందుకు రష్యా సరికొత్త ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. రక్షణశాఖతో కనీసం ఏడాది పాటు పనిచేసేలా ఒప్పందం కుదుర్చుకుంటే, సదరు సైనికుడికి లేదా వారి కుటుంబానికి ఉన్న రుణాల్లో 10 మిలియన్ రూబుల్స్ (సుమారు రూ.1.33 కోట్లు) వరకు రాయితీ కల్పించనున్నారు. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారిక ఉత్తర్వులపై సంతకం చేశారు. అయితే, మే 1వ తేదీకి ముందు రుణాలు తీసుకున్న వారికి మాత్రమే ఈ భారీ రుణ ఉపశమనం వర్తిస్తుందని క్రెమ్లిన్ వర్గాలు స్పష్టం చేశాయి.

Comments

G
Loading comments...