వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం నగర సమీపంలోని సీపన్నాయుడుపేట –విజయాదిత్య పార్క్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో అరుదైన బావురు పిల్లి మృతి చెందింది. శనివారం రహదారిని దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
పులి పిల్లను పోలి కనిపించే ఈ బావురు పిల్లి అంతరించి పోతున్న వన్యప్రాణి జాతుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
Comments
Loading comments...

