Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ దుర్మరణం

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 28, 2026 3:32 PM జాతీయంGeneral
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ దుర్మరణం - Udayam
అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన శ్రీపాతి దీపారెడ్డి(44) మృతి చెందారు. సిగ్నల్ వద్ద కారు ఆపి ఉండగా వెనుక నుంచి వచ్చిన మరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లైన దీపారెడ్డి, ఆమె భర్త రామకృష్ణారెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. వీరికి సంస్కృత, హర్షిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Comments

G
Loading comments...