వార్తలకు తిరిగి వెళ్లండి

రఘునాథపాలెం కేటీఆర్ కాలనీ వద్ద వాహనాల తనిఖీల్లో పోలీసులు 4.375 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన మహమ్మద్ యూసుఫ్ ఖాన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు షేక్ సమీర్ పరారయ్యాడు.
గంజాయి విలువ రూ.2.25 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. బైక్, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...

