Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు బీమాలపై కలెక్టర్‌కు వినతి

Follow Udayam on Google
Harika Aug 24, 2026 6:05 PM హన్మకొండ General
రైతు బీమాలపై కలెక్టర్‌కు వినతి - Udayam
హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ను రైతు రక్షణ సమితి నేతలు, పలువురు రైతులు కలిసి వినతిపత్రం అందించారు. పెండింగ్‌లో ఉన్న రైతు బీమా క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు బీమాపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వరికెల కిషన్‌రావు, హింగే భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...