వార్తలకు తిరిగి వెళ్లండి

రేగోడ్ మండలం కొత్వాల్‌పల్లిలో రాత్రి కురిసిన వర్షానికి రైతు అంజిరెడ్డికి చెందిన వరి పంట నేలకొరిగింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట పూర్తిగా దెబ్బతినడంతో రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితి లేదని, అప్పుల భారం ఎలా తీర్చాలో తెలియడం లేదని వాపోయారు. అధికారులు పంట నష్టాన్ని పరిశీలించి పరిహారం అందించాలని కోరారు.
Comments
Loading comments...

