వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లాలో రేషన్ దుకాణాల్లో బియ్యం నిల్వలు తగ్గడంతో కార్డుదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి సరఫరా చేస్తున్నా, నిల్వకు స్థలం లేకపోవడం, సరఫరాలో జాప్యంతో సమస్య ఏర్పడుతోంది.
జిల్లాలో 748 దుకాణాల పరిధిలో 4.73 లక్షల కార్డులు ఉన్నాయి. 24,359 టన్నులకు 20,895 టన్నుల బియ్యం చేరింది. మిగిలిన బియ్యం ఒకటి, రెండు రోజుల్లో చేరుతుందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

