వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల కారణంగా పలాస మండలం కిష్టుపురం రైల్వే అండర్‌పాస్ వరద నీటితో పూర్తిగా నిండిపోయింది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు బుధవారం కాశీబుగ్గ ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు.
లక్ష్మీపురం టోల్‌ప్లాజా వద్ద ఫాస్టాగ్ రుసుము తప్పించుకునేందుకు వాహనదారులు అండర్‌పాస్ వైపు వెళ్లవద్దని సూచించారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఎవరూ ఈ మార్గంలో ప్రయాణించరాదని ఎస్సై స్పష్టం చేశారు.
Comments
Loading comments...

