వార్తలకు తిరిగి వెళ్లండి

రావులపాలెం ఇందిరా కాలనీలోని రేషన్ దుకాణం డీలర్ కార్డుదారుల పట్ల దురుసుగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ సంచార జాతుల కన్వీనర్ వీర్నాల రమణబాబు ఆరోపించారు. ఈ మేరకు శనివారం డిప్యూటీ తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.
స్థానికుల సంతకాలతో సమర్పించిన ఫిర్యాదులో వినియోగదారులతో బియ్యం బస్తాలు ఎత్తిస్తున్నారని పేర్కొన్నారు. డీలర్‌పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రమణబాబు కోరారు.
Comments
Loading comments...

