Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాంపూర్ లో నిమజ్జన మార్గం.. పంచాయతీ ప్రత్యేక చొరవ

Follow Udayam on Google
md jabeer Sep 19, 2026 9:05 AM నిర్మల్General
నర్సాపూర్ జి మండలం రాంపూర్ గ్రామంలో వినాయక, దుర్గామాత నిమజ్జనానికి వెళ్లే టెంబరేణి చెరువు రోడ్డు మార్గం గుంతల మయంగా ఉందని రోడ్డును పంచాయతీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు. సర్పంచ్ చిన్నోళ్ల విజయలక్ష్మి, పంచాయతీ సెక్రటరీ నవనీత్, వార్డు సభ్యుల చొరవతో ఈ పనులు పూర్తయ్యాయి. నిమజ్జన వేడుకలకు వెళ్లే భక్తుల ఇబ్బందులు తొలగడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...