Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామతీర్థంలో ఘనంగా పూర్ణాహుతి కార్యక్రమం

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 23, 2026 1:39 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
రామతీర్థంలో ఘనంగా పూర్ణాహుతి కార్యక్రమం - Udayam
విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో బుధవారం పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈనెల 14 నుంచి ఇక్కడి రామాలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అర్చకులు ఇవాళ యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించారు. అలాగే చక్ర పెరుమాళ్లకు చక్రస్నానం జరిపించారు. అలాగే సాయంత్రం 4 గంటలకు ధ్వజావరోహణ జరుగుతుంది. దీంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని అర్చకులు తెలిపారు.

Comments

G
Loading comments...