వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలం రామడుగు జెడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ధర్పల్లి ఎంపీడీవో బి. మారుతి పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్ గౌడ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

