వార్తలకు తిరిగి వెళ్లండి

గంపలగూడెం మండలం ఊటుకూరు కోదండరామస్వామి ఆలయంలో దసరా ఉత్సవాల మూడో రోజు రాజ్యలక్ష్మి అమ్మవారికి అన్నపూర్ణాదేవి అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు ముందుగా కుంకుమ పూజలు నిర్వహించారు.
అనంతరం వేదమంత్రాల పారాయణంతో చండీ హోమం నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోగా, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Comments
Loading comments...

