వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారంలోని పలు ఆలయాల్లో దుర్గామాత బాలా త్రిపుర సుందరి అవతారంలో మంగళవారం భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలుచోట్ల అమ్మవారికి పంచామృత అభిషేకాలు చేశారు.
భవానీ మాలధారులు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Comments
Loading comments...

