వార్తలకు తిరిగి వెళ్లండి

ఆముదాలవలస మున్సిపాలిటీలోని పూజారిపేట నుయ్యీవీధి చివర రహదారి అధ్వానంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చిన్నపాటి వర్షానికే రహదారి మొత్తం బురదమయంగా మారుతోంది. దీంతో కాలినడకన వెళ్లేవారితో పాటు ద్విచక్ర వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రహదారితో పాటు డ్రైనేజీ నిర్మాణం చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.
Comments
Loading comments...

