Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పురుగుల మందు తాగి యువకుడు మృతి

Follow Udayam on Google
p.g.murthy Sep 20, 2026 7:40 PM మంచిర్యాలGeneral
పురుగుల మందు తాగి యువకుడు మృతి - Udayam
పెళ్లి కావడం లేదని పురుగుల మందు తాగి యువకుడు మృతి చెందిన ఘటన జన్నారం మండలంలోని కలమడుగులో జరిగింది. గ్రామానికి చెందిన మర్సకోల అంజి (26) కూలి పని చేసుకుంటూ జీవనోపాధిని పొందుతున్నాడు. పెళ్లి కావడం లేదని బాధతో మద్యానికి బానిసయ్యాడు. మద్యం మానుకోవాలని కుటుంబ సభ్యులు సూచించారు. పెళ్లి కాకపోవడం, మద్యాన్ని మానలేక విరక్తితో 19న పురుగుల మందు తాగగా, వరంగల్ ఆస్పత్రిలో మృతి చెందాడని ఎస్ఐ ఉదయ్ కిరణ్ తెలిపారు.

Comments

G
Loading comments...