Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగుపాటుకు ఫోన్లు పేలి ఇద్దరు రైతులకు తీవ్ర గాయాలు

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 9:03 PM నిజామాబాద్General
పిడుగుపాటుకు ఫోన్లు పేలి ఇద్దరు రైతులకు తీవ్ర గాయాలు - Udayam
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బొప్పాజీవాడ శివారులో పిడుగుపాటుకు ఇద్దరు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. పత్తి చేనులో పనిచేస్తున్న మేకల సూర్యకాంత్, గైని శంకర్‌ వర్షం రావడంతో గొడుగు పట్టుకుని నిల్చున్నారు. ఈ సమయంలో పిడుగు పడటంతో వారి వద్ద ఉన్న ఫోన్లు పేలిపోయాయి. ఇద్దరూ స్పృహ కోల్పోగా.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...