వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీల్లో లెక్కింపు కోసం ఎన్నికల కమిషన్ 138 కేంద్రాలను ఏర్పాటు చేసింది.
రాత్రి 8 గంటల్లోపే ఫలితాలు వెల్లడిస్తామని కమిషన్ తెలిపింది. 47,817 మంది సిబ్బంది, 1372 సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పక్కాగా జరిగేలా ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

