వార్తలకు తిరిగి వెళ్లండి

పాడి రైతులు తమ పశువులకు బీమా చేయించి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెటర్నరీ డాక్టర్ సురేశ్ తెలిపారు. పశువు విలువను బట్టి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు తక్కువ ప్రీమియంతో బీమా చేసుకోవచ్చన్నారు.
ఒక కుటుంబానికి గరిష్టంగా 10 పశువులకు బీమా చేసుకునే అవకాశం ఉందన్నారు. బీమా కాల పరిమితి మూడేళ్లు ఉంటుందని తెలిపారు. మరింత సమాచారం కోసం వెటర్నరీ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.
Comments
Loading comments...

