వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి మారుమూల గ్రామానికి కుళాయిల ద్వారా మంచినీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎస్.కోట MLA కోళ్ల లలితకుమారి శనివారం స్పష్టం చేశారు.
జల జీవన్ మిషన్ 2.0 పథకం ద్వారా ఎస్ కోటకు రూ.95.80 కోట్ల నిధులు మంజూరైనట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో 5 మండలాల పరిధిలో 296 ఆవాసాలలో సమగ్రంగా పనులు చేపట్టేందుకు సాంకేతిక పరిపాలనాపరమైన ఆమోదం లభించినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

