Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్‌ ఎదుట పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా

Follow Udayam on Google
Harika Aug 24, 2026 2:37 PM ఆదిలాబాద్General
కలెక్టరేట్‌ ఎదుట పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా - Udayam
ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు సోమవారం ధర్నా నిర్వహించారు. శక్తి స్కీమ్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో జీఓ 97ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏబీవీపీ నేతలు విద్యార్థులకు మద్దతు తెలిపారు. అనంతరం ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. వారు జీఓ 97 అమలుతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జీఓను రద్దు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...