Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్కాన్‌లో 6307 మంది రక్షణ

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 01, 2026 8:50 PM హైదరాబాద్General
ముస్కాన్‌లో 6307 మంది రక్షణ - Udayam
ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా జులై నెలలో తెలంగాణవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో పోలీసులు 6,307 మంది చిన్నారులను రక్షించారు. హోటళ్లు, టీ స్టాళ్లు, నిర్మాణ ప్రాంతాలు, ఇతర చోట్ల సోదాలు నిర్వహించారు. మొత్తం 1,705 కేసులు నమోదు చేసి 1,710 మందిని అరెస్టు చేశారు. 5,737 మంది చిన్నారులను కుటుంబాలకు అప్పగించగా, మరో 570 మందిని శిశు సంరక్షణ కేంద్రాలకు తరలించారు. రూ.37.95 లక్షల జరిమానా కూడా విధించారు.

Comments

G
Loading comments...