Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదకర మూలమలుపులు.. బోర్డులు ఏవీ?

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 10:58 AM సిద్దిపేటGeneral
ప్రమాదకర మూలమలుపులు.. బోర్డులు ఏవీ? - Udayam
కొండపాక మండలం మర్పడగ నుంచి తొగుట మండలం తుక్కాపూర్‌ వెళ్లే ప్రధాన రహదారిపై మూడు ప్రమాదకర మూలమలుపులు ఉన్నాయి. వేగ పరిమితి, హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు తెలిపారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతాల్లో వందల ప్రమాదాలు జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని ఇరు మండలాల వాసులు వాపోయారు. ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...