వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళూరులోని MRPL రిఫైనరీలో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. పేలుడు ప్రభావంతో జోకట్టె ప్రాంతంలోని ఇళ్లు, భవనాలు కంపించగా, మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ప్రకంపనలు కనిపించాయి.
పేలుడు అనంతరం రిఫైనరీ నుంచి దట్టమైన నల్ల పొగ వెలువడింది. MRPL ఫైర్ బ్రిగేడ్, భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. సాంకేతిక లోపమా, యూనిట్‌లో ఒత్తిడా కారణమా అనే దానిపై నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

