Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత: ఎమ్మెల్యే మురళీమోహన్

Follow Udayam on Google
dineshkumar Sep 19, 2026 5:00 PM చిత్తూరుGeneral
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత: ఎమ్మెల్యే మురళీమోహన్ - Udayam
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పూతలపట్టు ఎమ్మెల్యే కె. మురళీమోహన్ అన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ 21వ డివిజన్ వరిగపల్లిలో ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమంలో ఆయన పాల్గొని, మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...