వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ మండలం సంగెం శ్రీరాంపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసం సందర్భంగా తల్లులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారంపై అవగాహన కల్పించారు.
సమతుల్య ఆహారం, రక్తహీనత నివారణ, వ్యక్తిగత పరిశుభ్రతపై సూచనలు చేశారు. ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు తీసుకోవాలని అంగన్‌వాడీ సిబ్బంది సూచించారు. కార్యక్రమంలో శోభారాణి, భూదేవి, రజిత, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
Comments
Loading comments...

