Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం కాలువలో యువకుడి మృతదేహం

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 2:17 PM ఏలూరుGeneral
పోలవరం కాలువలో యువకుడి మృతదేహం - Udayam
దెందులూరు మండలం గాలాయగూడెం శివారు నాగులదేవునిపాడుకు చెందిన కొత్తపల్లి రఘురాం(20) మృతదేహం పెదవేగి మండలం అంకన్నగూడెం సమీపంలోని పోలవరం కుడి కాలువ లాకుల వద్ద మంగళవారం లభ్యమైంది. ఈనెల 11న ఇంట్లో గొడవ అనంతరం రఘురాం ఇంటి నుంచి వెళ్లిపోయారు. అతడి కోసం గాలిస్తుండగా కాలువ గట్టుపై బైకు, చొక్కా, బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ హాల్‌టికెట్‌ కనిపించాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...