Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలి

Follow Udayam on Google
Raghu Sep 24, 2026 7:51 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలి  - Udayam
భారీ వర్షాల నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదేశించారు. రహదారులపై పడిన చెట్లు, ఇతర అడ్డంకులను తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాలపై నిఘా ఉంచి, అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. బహుదా నది పరివాహక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...