వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.70 లక్షలతో నిర్మించిన పొన్నూరు అగ్నిమాపక కేంద్రం భవనం ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. గత టీడీపీ హయాంలో పనులు మొదలవగా.. వైసీపీ హయాంలో బిల్లులు రాక నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు పూర్తయినా ప్రారంభం కాలేదు.
దీంతో సిబ్బంది శిథిల భవనంలోనే విధులు నిర్వహిస్తున్నారు. 9 మంది సిబ్బంది ఉండాల్సిన చోట ఆరుగురే ఉండటంతో వారిపై తీవ్ర పనిభారం పడుతోంది.
Comments
Loading comments...

