వార్తలకు తిరిగి వెళ్లండి

వరద ముంపునకు గురైన పొలాల్లో నిల్వ నీటిని వెంటనే బయటకు పంపించి పంట నష్టాన్ని తగ్గించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో రైతుల నష్టాల వివరాలు నమోదు చేసి అవసరమైన ఎరువులు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టి, తాగునీటి నాణ్యత పరీక్షల అనంతరం సరఫరా పునరుద్ధరించాలని సూచించారు.
Comments
Loading comments...

