వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాల్‌పేటలో పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలను బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు ఎత్తుకుని ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పోచమ్మ తల్లిని దర్శించుకున్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. గ్రామ పెద్దలు, మహిళలు, యువత పాల్గొన్నారు.
Comments
Loading comments...

