Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అటవీ ప్రాంతంలో ఐదు రోజులుగా పడి ఉన్న వ్యక్తి

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 07, 2026 10:59 AM నిజామాబాద్General
అటవీ ప్రాంతంలో ఐదు రోజులుగా పడి ఉన్న వ్యక్తి - Udayam
నిజామాబాద్‌ జిల్లా మోస్రా మండలం చింతకుంట అటవీ ప్రాంతంలో ఐదు రోజులుగా పడి ఉన్న ఓ వ్యక్తిని పశువుల కాపరులు గురువారం సాయంత్రం గుర్తించారు. ఒంటినిండా చీమలు కుట్టిన స్థితిలో ఉన్న అతడిని గ్రామస్థులు ఆసుపత్రికి తరలించారు. 108 సిబ్బంది రాములు, అజయ్‌ సహాయంతో అతడిని నిజామాబాద్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. సిబ్బందిని గ్రామస్థులు, వైద్యులు అభినందించారు. వ్యక్తి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...